చాలా మంది యువకులు ఆన్ లైన్ బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. కొందరు తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు.. ఆశయాలను తుంచివేస్తూ వారికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసగా మారిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.