తన నామినేషన్ వేసే సమయంలో కూడా చంద్రబాబు కుప్పంకి వెళ్లేవారు కాదు. ఆయన తరపున ఎవరో ఒకరు ఆ తంతు పూర్తి చేశారు, అక్కడ చంద్రబాబు పెద్దగా ప్రచారం చేయకపోయినా, విజయం మాత్రం ఎప్పుడూ ఆయనదే. ఆ నియోజకవర్గంపై బాబుకి అంత ధీమా ఉండేది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ తగ్గే సరికి కాస్త డీలా పడ్డారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సగానికి సగం వైసీపీ కొట్టుకుపోయే సరికి ఇంకాస్త ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి మరమ్మతులు చేయడంతోపాటు, భవిష్యత్ లో దాన్ని కొడుక్కి అప్పగించే ఆలోచన చేస్తున్నారట బాబు. అందుకే కుప్పంకి లోకేష్ వస్తారని భరోసా ఇచ్చారు. తరచూ కొడుకుని కుప్పం వెళ్లేలా సిద్ధం చేస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి లోకేష్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.