టీటీడీ బడ్జెట్ ఘనంగా ఉన్నా కూడా.. వడ్డికాసులవాడిని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఏకంగా ఏడాదికి రూ.205.08 కోట్ల మేర శ్రీవారి ఆదాయంలో కోత పడుతోంది. ఇదేదో ఊహాజనిత వార్త కాదు. టీటీడీ బడ్జెట్ లో ప్రస్తావించిన విషయమే. సామాన్యుడికే కాదు.. సాక్షాత్తూ ఆ వడ్డీ కాసుల వాడికే బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ తగ్గుతోంది. ఈ విషయం టీటీడీ బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది.