మీకు సైటుందా, మీరు కళ్లజోడు ధరిస్తారా.. అయితే మీకు కరోనా ముప్పు తక్కువేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. తాము చేసిన పరిశోధనల్లో కూడా ఇదే విషయం తేలిందని చెబుతున్నారు. కళ్లజోడు ధరించేవారికి కరోనా ముప్పు పూర్తిగా లేదని చెప్పలేం కానీ, ఇతరులకంటే వారికి ఈ ముప్పు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దానికి తమదైన లాజిక్ కూడా జతచేశారు.