తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి భక్తలు తరిలివస్తుంటారు. అయితే వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది. అలిపిరి టోల్గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్గేట్ వద్ద వసూలు చేస్తోన్న ఛార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచారు.