చిత్తూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బోణీ కాదని, ఆయన విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పుంగనూరు మండలం కురప్పల్లెలో జరిగిన మసెమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కరోనాకు భయపడి ఎక్కడా పర్యటించకుండా ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు.