ప్రాణం పోతుంది అంటే ఫోన్ లో వీడియోలు తీసే ఈ సమాజంలో మరోసారి మానవత్వం విరిసింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ గ్రామ వాలంటీర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురి ప్రాణాలను కాపాడాడు. వాలంటీర్ తన ప్రాణాలకు తెగించి మరీ వారిని రక్షించారు. అందులో ఇద్దరు వృద్దులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలో చోటు చేసుకుంది.