ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న స్టేట్ హైవేలను, నేషనల్ హైవేలుగా మార్చాడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అదే జరిగితే ఇప్పుడున్న స్టేట్ హైవేస్ పై కూడా టోల్ గేట్లు వచ్చి చేరుతాయి. అంటే ఇకపై ఏ రోడ్డులో వెళ్లాలన్నా టోల్ ఫీజు చెల్లించాల్సిందే అనమాట. అయితే రాష్ట్ర రహదారులపై కూడా టోల్ గేట్లు పెట్టాలని ఆల్రడీ ప్రభుత్వం నిర్ణయించడంతో.. పేరు మారినా, మారకపోయినా ఏపీ ప్రజలకు టోల్ బాదుడు మాత్రం తొలగిపోయేలా కనిపించడంలేదు.