మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇంటిలోకి ప్రవేశించి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె భర్త ముందే వెకిలి చేష్టలకు దిగాడు. మద్యం మత్తులో అతను ఈ విధంగా ప్రవర్తించడంతో స్థానికులు అతన్ని మందలించారు. అయితే ఇది జరిగిన కొన్నిరోజులకు మహిళ బంధువులు అతడిపై దాడి చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది.