పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారని, దాని వల్ల ఆదా అయ్యే ప్రాజెక్ట్ వ్యయాన్ని వైసీపీ నాయకులు కొట్టేస్తారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇటీవల కొన్ని పరిణామాలు జరిగాయని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కేంద్రానికి రాష్ట్రం తరపున ప్రతిపాదనలు వెళ్లాయని, కేంద్రం పోలవరం ఎత్తు తగ్గింపుపై అధ్యయనం చేసిందని ఆ కథనాల సారాంశం. దీంతో వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. పోలవరం ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.