జమ్మలమడుగు ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థి విషయంలో జమ్మలమడుగులో సోమవారం ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. పోలీసుల కథనం ప్రకారం: నగర పంచాయతీ పరిధిలోని 18వ వార్డుకు వైకాపా కార్యకర్త మున్నా గతంలో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. అదే వార్డులో మరి కొంతమంది వైకాపా తరపున పోటీ చేస్తున్నందున మున్నాను పోటీ నుంచి విరమించుకోవాలని నాయకులు కోరారు. ఇకపోతే బీజేపికి చెందిన కొందరు నాయకులు బరిలో ఉంటే మద్దతుగా ఉంటామని చెప్పడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.