చిత్తూరు లో టెన్షన్ వాతావరణం నెలకొంది.. టీడీపీ నేతలు భయంలో ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావాలన్నా కూడా భయపడుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.జిల్లావ్యాప్తంగా ఉన్న తెదేపా నాయకులు నిరసనల్లో పాల్గొనడానికి ఆయా నగరాలకు వస్తుండగా పోలీసులు గృహ నిర్బంధాలు, అరెస్టులతో అడ్డుకున్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరులో బైఠాయించారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలకు ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి లా మారింది. ఈరోజు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇప్పటికీ టీడీపీ లో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన నేతలు నిన్నటి వరకు మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎంటో అనే చర్చగా మారింది.