తాజాగా వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓవ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చి చెరువులో పడేశారు. ఈ ఘటన బొంరస్పేట మండలంలోని మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్య (52)అనే వ్యక్తి రెండు రోజులుగా కనిపించడంలేదు.