పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీ తగ్గిపోతుందనే భావనతోపాటు, నకిలీ కరెన్సీ బెడద కూడా తగ్గిపోతుందని అనుకున్నారంతా. కానీ పాత నోట్ల కంటే, కొత్త నోట్ల ప్రింటింగ్ విషయంలోనే అక్రమార్కులు తెలివి మీరిపోయారనే విషయం అప్పుడప్పుడూ బయటపడుతోంది. తాజాగా ఒడిశాలో నకిలీ నోట్లు చలామణికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.