చాల మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. అయితే ముల్లంగి రుచిని ఇష్టపడేవారు మాత్రం వాటిని పచ్చివి కూడా తింటుంటారు. ఇక ఉడకబెట్టిన వాటికంటే పచ్చివి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ముల్లంగిని రసం చేసి దాన్ని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందంటా.