పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టినా, మున్సిపాల్టీల విషయంలో టీడీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. కార్యకర్తలు, నాయకుల ధీమా ఎలా ఉందో తెలియదు కానీ, చంద్రబాబు మాత్రం పురపాలికల్లో టీడీపీ జెండా ఎగరేస్తామంటూ గట్టిగా చెబుతున్నారు. ఇటీవలే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది టీడీపీ. ఇప్పుడు కొత్తగా ఆస్తి పన్ను తగ్గించే విషయంలో చంద్రబాబు మరో ప్రకటన ఇచ్చారు. టీడీపీ గెలిచిన పురపాలక, నగర పాలక సంస్థల్లో ఆస్తి పన్ను తగ్గిస్తూ కౌన్సిల్ మొదటి సమావేశంలోనే తీర్మానిస్తామని చెప్పారు చంద్రబాబు.