భారత్ లో ఇప్పటికే తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయింది. రెండో డోసు కూడా మొదలైంది. సరిగ్గా 28రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలని ఇప్పటికే వైద్య అధికారులు ప్రకటించారు. అలా తీసుకోకపోతే టీకా తీసుకున్న ఫలితం ఉండదని హెచ్చరిస్తున్నారు. కచ్చితంగా రెండు డోసులు కొవిడ్ టీకా తీసుకుంటేనే దాని ద్వారా కరోనా నియంత్రించ వచ్చని చెబుతున్నారు.