కొత్తవారిని ఎక్కువగా నమ్మకూడదు అని పెద్దవాళ్ళు చెబుతుంటే వినే ఉంటాము. ఇక ఫుడ్ డెలివరీ తెచ్చే బాయ్సే దొంగతనానికి పాల్పడుతారని ఎవరైనా అనుకుంటారా. కానీ నోయిడాలో అదే నిజం అయ్యింది. వాళ్లిద్దరూ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీలో పనిచేస్తున్నారు. వాళ్లిద్దరూ సిటీలోని ఇళ్ల తాళాలు పగలగొట్టి విలువైన ఐటెమ్స్ ఎత్తుకుపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.