రాజకీయాలలో విజయాన్ని దక్కించుకోవాలంటే ఎత్తుకు పై ఎత్తులు వేయడం చాలా ముఖ్యం. రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో ముందుండాలి. అప్పుడే ప్రత్యర్థిని గెలవడానికి సులభంగా ఉంటుంది. అయితే ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను మనము సినిమాలలో చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం వాస్తవ రాజకీయాలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్.