వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి అయిన భరద్వాజ్ వరంగల్ రూరల్ ఇన్నోవేటర్ అయిన యాకర గణేశ్ సహకారంతో ఒక స్మార్ట్ డాల్ ని తయారు చేశారు. ఈ బొమ్మ తయారీకి ఒక ట్రాన్సిస్టర్, రకరకాల సెన్సార్లు, ఒక స్పీకరు, మైక్రో సెన్సార్లు ఉపయోగించారు. అయితే ఈ బొమ్మను రకరకాల భాగాల్లో టచ్ చేస్తున్నప్పుడు ఆ టచ్ మంచిదో.. లేక చెడ్డదో స్పీకర్ ద్వారా పెద్దగా వినిపిస్తుంది. ఈ బొమ్మను చిన్న పిల్లలకు ఇవ్వడం ద్వారా వారికి గుడ్ టచ్ ఏంటో, బ్యాడ్ టచ్ ఏంటో పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. దీని వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి.