మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏకగ్రీవాల జోరు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తారని భావించినా అలా జరగలేదు. కానీ భారీ ఎత్తున ఏకగ్రీవాలు మాత్రం నమోదయ్యాయి. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 222 ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. ఇందులోనూ దాదాపు సగం ఏకగ్రీవాలు సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోనే చొటు చోసుకోవడం మరో విశేషం...