ఎండు ద్రాక్ష తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. మాములు ద్రాక్ష కంటే ఎండు ద్రాక్షలో మంచి పోషక పదార్దాలు లభిస్తాయి. ఇక ఎండుద్రాక్ష వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట. వీటిలో యాంటీయాక్సిడెంట్లు, పీచు పదార్థం ఉండటం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చే శక్తి ద్రాక్షలో ఉంది.