నేటి సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. కానీ స్త్రీపై పురుష ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. తాజాగా తన మాట వినడం లేదని క్షణికావేశానికి లోనైన భర్త.. భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజరలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.