సీఎం జగన్ ఒక్కసారి కమిట్ అయితే ఆ పని చేసి తీరాల్సిందేనంటారు. కోర్టులు అడ్డు పడుతున్నా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా కోర్టులో కేసులున్నా జగన్ ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఏపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ విషయంలో విడుదలైన ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విజయవాడలో నిర్మించ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడు విశాఖకు తరలిస్తున్నారు.