ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉన్నట్టుండి కలకలం రేగింది. భక్తులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా కడుపు నొప్పి అంటూ పడిపోయారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందేమోనన్న అనుమానంతో సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు అధికారులు.