దేశవ్యాప్తంగా తొలి విడత కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదనే విషయం తేలింది. వైద్య సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందిలో కొంతమంది, ఉన్నతాధికారుల బలవంతం వల్లే వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు టీకా జనబాహుళ్యంలోకి వచ్చేసింది. ప్రైవేటుగా కూడా టీకా కొని వేయించుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. దీంతో అసలు సామాన్య ప్రజలు టీకాలు వేయించుకోడానికి ముందుకొస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. మూడు రోజులుగా ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తే ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయినట్టేనని అంటున్నారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కి అనూహ్య స్పందన వచ్చిందని చెబుతున్నారు.