ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్ మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎస్.ఎస్.సి. సిలబస్ తీసేసి సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు బోధనలో కూడా తగిన సామర్థ్యాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ దశలో డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో భారీగా మార్పులు చేర్పులు జరుగుతాయని అంటున్నారు. ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని ప్రత్యేకంగా పరీక్షిస్తారని తెలుస్తోంది. అయితే ఈ మార్పులు చేర్పులతో ముందుగానే అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.