పంచాయతీ పోరులో బాలకృష్ణ ఏమాత్రం ప్రచారం చేశారు, సొంత నియోజకవర్గంలో ఎంతమాత్రం కలియదిరిగారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పురపోరులో మాత్రం అలా నిర్లక్ష్యం చేస్తే తగదని అంటున్నారు చంద్రబాబు. అందుకే బావమరిదిని పోరు పెట్టి మరీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేశారు. హిందూపురంలో బాలయ్య ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. చంద్రబాబు బలవంతం వల్లే బాలకృష్ణ ఇప్పుడు హిందూపురం బాట పట్టారు. కుప్పంలో పంచాయతీలు కోల్పోవడంతో ఇబ్బంది పడ్డ చంద్రబాబు.. టీడీపీకి కంచుకోటలా ఉన్న హిందూపురంలో కూడా అలాంటి పరిస్థితి రాకూడదని బాలయ్యకు హితవుపలికారు.