కామాంధుల నుండి ఆడపిల్లలను రక్షించాల్సిన పోలీసులే వారి పట్ల కర్కశంగా ప్రవర్తించారు. రక్షించాల్సిన ఖాకీలే కీచకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్లోని కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. మహారాష్ట్రలోని బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.