విమాన ప్రయాణంలో ఉన్నప్పడు కిటికీలు బద్దలైతే? అన్న డౌట్ రావచ్చు.. కానీ.. పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్కట్టర్లు విమానంలో తీసుకెళ్లనీయరు. ఇక, విమానం కిటికీలను పాలీ కార్బొనేట్తో తయారుచేస్తారు. బలమైన మనిషి పిడికిలితో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళుతున్నప్పుడు పడే ఒత్తిడినీ, గాలీ వానా ఎండలనూ తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. అవీ మూడు పొరలుగా ఉంటాయి. కాబట్టి, భయపడాల్సిన పన్లేదు.