పీఆర్వో విజయ్ వ్యవహారశైలి ఇటీవల బాగా మారిందని.. నేతలను సైతం లెక్క చేయడం లేదని.. సొంతపార్టీ గుట్టు బయటపెడుతున్నరని.. అనేక ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. పీఆర్వోగా తన పరిధిని దాటి ఇతర విషయాల్లో వేలు పెడుతున్నారని, కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పజెప్పే విషయంలో విజయకుమార్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.