పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, పన్నులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయవనరులు. అందువల్లే చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలకు సుముఖంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి.