వైసీపీ అత్యధిక ఏకగ్రీవాలను తన ఖాతాలో వేసుకుంది. మూడు మున్సిపాలిటిలో మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. అయితే ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల జరిగిన సంఘటనలపై టీడీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండకు కారణం ఏంటి?. ప్రతిపక్షాల అభ్యర్థులను బలవంతంగా ఎందుకు విత్ డ్రా చేయిస్తోంది?. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని వైసీపీ భయపడుతోందా? వైసీపీ ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. అయిన ఎన్నికల కమీషన్ ఎందుకు మౌనం వహిస్తుంది అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎన్నికల ఫలితాలు చేప్తాయా? లేదా అనేది చూడాలి