తెలంగాణ సర్కారు, స్కూల్స్ రీఓపెనింగ్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించింది. మిగతా రాష్ట్రాలకంటే ఆలస్యంగా స్కూళ్లు తెరిచింది. అయితే ప్రభుత్వం అనుమానించినట్టుగానే ఇప్పుడు కరోనా మహమ్మారి విద్యార్థులను భయపెడుతోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మంది విద్యార్థులనుంచి నమూనాలు సేకరించి ల్యాబ్ కు తరలించారు.