మమతా బెనర్జీ పగబట్టింది. నిన్నటి వరకూ తన తర్వాత తృణమూల్ లో నెంబర్-2 ప్లేస్ లో ఉన్న సువేందు అధికారిపై ఆమె ప్రతీకారం తీర్చుకోబోతోంది. బీజేపీలో చేరిన సువేందుని రాజకీయంగా తొక్కిపడేస్తానంటూ శపథం చేసిన మమత, తన సొంత నియోజకవర్గం వదిలి మరీ సువేందుపై పోటీకోసం నందిగ్రామ్ వెళ్తోంది. అవును మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి పోటీచేయడంలేదు. గతంలో తృణమూల్ కీలక నేత, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి సొంత నియోజకవర్గం అయిన నందిగ్రామ్ ను ఆమె పోటీకి ఎంచుకుంది.