ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడు అడుగులు వేశాడు.. చేతిలో చేయి వేసి ప్రామాణాలు చేశాడు. మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చాడు. భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిందిపోయి అనుమానం పెంచుకున్నాడు. ఇతరులు వేధిస్తున్నారని వారి బారి నుంచి కాపాడాలని భర్తను వేడుకుంటే వారితో ఏదో సంబంధం ఉందని అనుమానించి భర్తే కడతేర్చాడు.