ప్లమ్ పండ్లు అంటే ఎవరికీ ఎక్కువగా తెలీదు. మన దేశంలో ప్లమ్ పండ్లను అలూ బుఖారా పండ్లు అంటారు. ప్లమ్‌లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండెకు మేలు చేస్తాయి. విష వ్యర్థాల్ని తొలగిస్తాయి. గుండె సమస్యల్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెను కాపాడతాయి. ఈ రోజుల్లో చాలా మందికి మలబద్ధకం సమస్య బాగా ఉంటోంది. వారు ప్లమ్ పండ్లను తింటే.. జీర్ణవ్యవస్త మెరుగవుతుంది.