ఒడిసా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం..మురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే యువకుడితో గురువారం రాత్రి వివాహం జరిపించారు. మరుసటి రోజు ఉదయం వధువును అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అప్పగింతల కార్యక్రమంలో నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది.