కొన్ని చోట్ల రేషన్ ట్రక్ డ్రైవర్లు కొత్త బిజినెస్ కి తెరతీశారు. గతంలో రేషన్ డీలర్లు తమ షాపుల్లోనే ఇతర వస్తువులు కూడా అమ్ముతున్నట్టు.. రేషన్ ట్రక్కులనే మొబైల్ బిజినెస్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, కందిపప్పు, చక్కెర మినహా ఇంకేవీ విక్రయించకూడదని, ఇంకే ఇతర అవసరాలకు వాహనాలను వాడకూడదనే నిబంధన ఉన్నా కూడా వాటితో వ్యాపారం మొదలు పెట్టారు.