నందమూరి బాలకృష్ణ మున్సిపల్ ప్రచార రంగంలోకి దిగారు. పంచాయతీల విషయంలో ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నా.. పార్టీ గుర్తుపై జరిగే మున్సిపాల్టీల విషయంలో బాలయ్యని కూడా రంగంలోకి దించారు బావ చంద్రబాబు. అయితే బాలయ్య ప్రచారంపై అప్పుడే వ్యతిరేక ప్రచారం మొదలైంది. తనతోపాటు ప్రచారానికి వచ్చిన నాయకులపై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని, ఆయన వాహనం వెంట ఎవరూ ఉండటంలేదని, అసలు బాలయ్య ప్రచారానికి జనమే కరువయ్యారంటూ వైసీపీ అనుకూల మీడియా వార్తలు ఇస్తోంది.