అధికార పార్టీ నుంచి అధ్యక్షుడు జగన్ కనీసం ఒక్క జిల్లాలోనూ పర్యటించకుండా అంతా తాడేపల్లి నుంచే కథ నడిపించేస్తున్నారు. కానీ.. ప్రతిపక్షం మాత్రం ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ.. అందరూ ప్రచార రంగంలోకి దిగారు.