కడపలో ఒక వార్త సంచలనంగా మారింది.మైదుకూరు మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి ధనపాల జగన్ ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేశారు. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రచారం విషయం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇంటికి వచ్చారు.మైదుకూరు డీఎస్పీ విజయకుమార్తోపాటు 50 మందికిపైగా పోలీసులు ధనపాల ఇంటిని చుట్టుము ట్టారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని.. ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు.