75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన జాతీయ కమిటీ లో తెలుగు రాష్ట్రాల నుంచి జగన్, కేసీఆర్, బండారు దత్తాత్రేయ, రామోజీరావు, పుల్లెల గోపీచంద్, పి.వి.సింధు స్థానం దక్కించుకున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా స్థానం దక్కించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం స్థానం దక్కలేదు. పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లోనూ మూకుమ్మడిగా ఉన్నారు. అయినా కూడా ఆయనను కమిటీలో సభ్యునిగా ఎంచుకోకపోవడం గమనార్హం.