ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణది సపరేట్ స్టైల్. యాక్టర్ గా ప్రజాప్రతినిథిగా డ్యుయల్ రోల్ పోషిస్తున్న బాలయ్య. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిపై చేయి చేసుకున్నారన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు స్పందించాడు.