నేటి సమాజంలోనే కాదు.. అప్పట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేదు. కామాంధుల వికృత చేష్టలకు పుట్టిన ఓ అబ్బాయి అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది. యూపీలోని షాజహాన్ పూర్ లో జరిగింది ఈ ఘటన.. 27 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ వయస్సులో ఉన్న బాలికపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత తల్లి అయిన ఆమె ఇప్పుడు ఆ నిందితులపై కోర్టుకెక్కింది.