అర్జంట్ గా సన్నబడిపోవాలనుకునేవారు చాలావరకు మందులపై ఆధారపడతారు. అలాంటి వారిని మోసం చేసేందుకే కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి. అయితే సన్నబడటంతోపాటు ఇతర ఆర్థిక లాభాలు కూడా ఉంటాయటూ ఊరించిన ఓ సంస్థ చివరకు కస్టమర్లను నిండా ముంచింది. వారి ఉత్పత్తులకు ఎలాంటి అనుమతులు లేకపోగా, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలతో ప్రజల్ని దారుణంగా వంచించింది. చివరకు దాని ఓనర్ సహా.. ఇతర సభ్యులు కూడా కటకటాలపాలవ్వాల్సి వచ్చింది.