దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనపడుతోంది. అయితే మహారాష్ట్రలో ఈ పెరుగుతల పరిధి దాటింది. గతంలో జనవరి 29న 18,885 కరోనా కేసులు నమోదైన తర్వాత ఇప్పటి వరకూ ఆ సంఖ్య మహారాష్ట్రలో పెరగలేదు. 10వేల లోపుకి పడిపోయిన కేసుల సంఖ్య ఇప్పుడు క్రమక్రమంగా మళ్లీ పెరుగుతోంది. ఎంతలా గతంలో ఎక్కడైతే బ్రేక్ పడిందో.. ఇప్పుడు ఆ పాయింట్ ని కూడా మహారాష్ట్ర చేరిపోయింది. తాజాగా 24గంటల్లో మహారాష్ట్రలో నమోదైన కొత్త కరోనా కేసుల సంఖ్య 18,327కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.