జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆఫీస్‌ను 18వ వార్డు మహిళా ఓటర్లు ముట్టడించారు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారని ఎమ్మెల్యేను ఆందోళనకారులు నిలదీశారు. ఏకగ్రీవం పేరుతో తమ ఓటు హక్కును కాలరాస్తున్నారని నిలదీశారు.. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడ నుంచి వెళ్ళిపోయారు.. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని నచ్ఛ చెప్పి వారందరినీ అక్కడి నుంచి బయటకు పంపించేశారు.