సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. పొట్టకూటి చేసిన ఇంట్లో పనికి వచ్చిన ఓ మహిళను నిర్భంధించిన యజమాని.. 15 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై బాధిత మహిళ కుమార్తె ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను రక్షించారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.