నాగార్జున సాగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ వరుసగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో.. నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని భావించినా.. ఇంకా స్పష్టత రావట్లేదు. అయితే ఎన్నిక ఎప్పుడు జరిగినా కూడా సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అధినేత కేసీఆర్.